FbTelugu

హజ్ ప్రార్థనలు… సామాజిక దూరం…

మక్కా: సౌదీ అరేబియా దేశం మక్కాలో కట్టుదిట్టమైన భద్రత, జాగ్రత్తల నడుమ పవిత్ర హజ్ ప్రారంభమైంది. సామాజిక దూరం పాటిస్తూ ప్రార్థనలు చేశారు.

కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది విదేశాల నుంచి ముస్లిం లను అనుమతించడం లేదని ఇదివరకే ప్రకటించారు. సౌదీ అరేబియాలో నివసిస్తున్నవారికి మాత్రమే ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతించారు. మక్కా ప్రార్థనలకు వచ్చేవారు తొలుత హోం క్వారంటైన్ లో ఉండాలని, ప్రార్థనలు ముగించుకుని ఇంటికి వెళ్లే ముందు మక్కాలో నాలుగు రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.

ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని, మాస్క్ లేకుండా కన్పిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. సౌదీ అరేబియాలో ఇప్పటి వరకు 2,70,000 కేసులు నమోదు కాగా 3వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మహమ్మారిని నియంత్రించేందుకు దేశ వ్యాప్తంగా కఠినంగా లాక్ డౌన్ అమలు చేశారు. హాజ్ మాసం కోసం గత నెలలో లాక్ డౌన్ ఎత్తివేశారు.

You might also like