FbTelugu

హాజ్ యాత్ర కేవలం సౌదీ వాసులకే

జెడ్డా: ప్రపంచ నలుమూలల నుంచి ముస్లింలు ప్రతి ఏడాది పవిత్ర హజ్ యాత్రకు బయలుదేరుతారు. కరోనా మహమ్మారి కారణంగా గతేడాది నుంచి ఆంక్షలు అమలవుతున్నాయి.

వచ్చే నెలలో హజ్ యాత్ర ప్రారంభం కానున్నది. ఈ ఏడాది కూడా హజ్ యాత్రకు కేవలం 60వేల మందినే అనుమతిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. అది కూడా సౌది అరేబియా వాసులకు మాత్రమేనని, ఇతర దేశస్తులైన ముస్లింలకు ప్రవేశం లేదని స్పష్టం చేసింది. కరోనా మహమ్మారితో యాత్రికుల ప్రాణాలను కాపాడే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని సౌది అరేబియా వెల్లడించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.