FbTelugu

హ్యాకర్ల దాడి… కోట్లలో లూటీ!

వాషింగ్టన్: అసలే కరోనా మహమ్మారి. వ్యాపారాలు లేక గిలగిలలాడుతున్న సమయంలో సైబర్ హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. అమెరికాలో హ్యాకర్లు సంస్థల నెట్ వర్కింగ్ పై దాడి చేసి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు.
కలోనియల్ పైపులైన్ కంప్యూటర్లను హ్యాక్ చేసిన ఘటన మరువక ముందే మరో ఘటన అమెరికాలో జరిగింది. ప్రపంచంలో పేరున్న గొడ్డు మాంసం వ్యాపారి జెబిఎస్ పై సైబర్ దాడికి దిగారు. హ్యాకింగ్ సమయంలో వ్యాపారం పూర్తిగా పడిపోయింది. ఏం జరిగిందని యాజమాన్యం ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని సంస్థ సిఈఓ అండ్రి నౌగెరా బుధవారం నాడు వెల్లడించారు. నేను చెప్పే విషయం వ్యక్తిగతంగా తనకు, సంస్థకు చాలా ఇబ్బందికరమని వ్యాఖ్యానించారు. హ్యాకర్లు సుమారు 4.4 మిలియన్ డాలర్లు వసూలు చేశారు. అమెరికాలతో గత రెండేళ్లు సైబర్ దాడులు ఎక్కువయ్యాయి. వీరి మూలంగా అమెరికాలో గతేడాది బాధితులు, సంస్థలు రూ.3వేల కోట్ల వరకు ముట్టచెప్పుకుని బయటపడ్డారు.

ఈ చెల్లింపులు అన్ని క్రిఫ్టో కరెన్సీలో జరుగుతున్నాయి. కలోనియల్ సొమ్మును ఎప్.బి.ఐ స్వాధీనం చేసుకున్న గంటల్లోనే జెబిఎస్ పై సైబర్ నేరగాళ్లు పంజా విసిరారు.
జెబిఎస్ కు అమెరికాలో తొమ్మిది గొడ్డుమాంసం ప్రాసెస్ చేసే కర్మాగారాలు ఉన్నాయి. వీటిపై గతవారం సైబర్ దాడి జరగ్గా, ఉత్పత్తి, సేల్స్ కు ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే ఈ నేరగాళ్లకు రష్యాతో సంబంధాలు ఉండవచ్చని ఎఫ్.బి.ఐ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కంపెనీ ఏడా 200 మిలియన్ డార్లను ఐటి పై ఖర్చు చేస్తున్నది. ఇందుకోసం ప్రపంచ వ్యాప్తంగా 850 మంది ఐటి ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయినప్పటికీ సైబర్ ముప్పు తప్పలేదు.

You might also like

Leave A Reply

Your email address will not be published.