FbTelugu

జీవీఎంసీ కమిషనర్ అర్థరాత్రి బదిలీ

అమరావతి: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కమిషనర్ జి.సృజనను ప్రభుత్వం మంగళవారం అర్థరాత్రి ఆకస్మికంగా బదిలీ చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఆదేశాల మేరకు ఆమెను బదిలీ చేశారు.
ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ గా పనిచేస్తున్న నాగలక్ష్మీ సెల్వరాజన్ (2012) ను నియమించారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సమాయత్తమవుతున్న తరుణంలో రెండు రోజుల క్రితమే సృజన (2018) సెలవుపై వెళ్లింది. ఆమె స్థానంలో వీఎంఆర్డీఏ కమిషనర్ కోటేశ్వర రావుకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. తాజాగా ప్రభుత్వం బదిలీ చేయడం, ఎన్నికల కమిషన్ సూచించిన నాగలక్ష్మీని కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

సృజనను సెలవుపై పంపించి, ఇన్ ఛార్జీ అధికారితో ఎన్నికలు నిర్వహించాలని వైసీపీ పెద్దలు నిర్ణయించారు. ఎన్నికల తరువాత ఆమెనే మళ్లీ రప్పించాలనే వ్యూహాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముందే గమనించి చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

You might also like

Leave A Reply

Your email address will not be published.