FbTelugu

తిరుపతిలో గురుమూర్తికి తిరుగులేదు

తిరుపతి: ఉప ఎన్నికల్లో తిరుపతి నుంచి నిల్చున్న వైసిపి అభ్యర్తి డాక్టర్ గురుమూర్తి విజయం దిశగా సాగుతున్నారు. మొదటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని రౌండ్లలో ఆయనే పై చేయిగా ఉంది.

ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం సమీప టిడిపి అభ్యర్థి పనబాక లక్ష్మీపై 1,58,401 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. 11వ రౌండ్ ముగిసే సరికి వైసిపికి 3,62,315 ఓట్లు పోలవ్వగా, టిడిపి అభ్యర్థి 2,03,914 ఓట్లు వచ్చాయి. బిజెపి అభ్యర్థి కె.రత్నప్రభకు 35,554 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ కు 5,905 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ల ఓట్లలో కూడా గురుమూర్తి 2500 ఓట్ల ఆధిక్యం సాధించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.