FbTelugu

శవాల వ్యాపారంపై గుంటూరు మేయర్ ఆగ్రహం

గుంటూరు: నగరంలోని అన్ని స్మశాన వాటికల్లో అంత్యక్రియల ఖర్చుల సూచిక బోర్డు లు ఏర్పాటు చేయాలని మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు ఆదేశించారు. స్మశానాల్లో అధిక వసూళ్ళు, సౌకర్యాల పై శానిటరీ సూపర్ వైజర్ల ఆధ్వర్యంలో సంబందిత శానిటరీ ఇన్స్పెక్టర్ లు నిత్యం పర్యవేక్షణ చేయాలన్నారు.

స్మశాన వాటికల్లో ట్రస్టు పేరుతో అత్యక్రియలకు రూ. 15 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో నగర మేయర్ కావటి శివ నాగ మనోహర నాయుడు, కమిషనర్ అనురాధ శుక్రవారం పర్యటించారు. నిబందనలు ఉల్లంఘించినవారి పై కఠిన చర్యలు తీసుకోవాలని మేయర్ స్పష్టం చేశారు. అధిక వసూళ్ళు చేసే వారి పై గుంటూరు నగర పాలక సంస్థ కాల్ సెంటర్ 0863-2345103 కి ఫిర్యాదు చేయవచ్చని ప్రజలకు తెలిపారు. స్మశాన వాటికల్లో కమిటీ ప్రతినిధులతో మాట్లాడి అంత్యక్రియల సూచిక బోర్డు లు ఏర్పాటు చేయించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.