FbTelugu

గంటా రాజీనామా ఆమోదం కాదు: బీజేపీ నేత విష్ణు

విశాఖపట్నం: టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు ఏ ఫార్మాట్ లో రాజీనామా చేసిన ఆమోదం లభించదని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. ఎన్నికల తరువాత గంటా ఏ పార్టీకి వెళ్తారో అందరికీ తెలుసని విష్ణు పేర్కొన్నారు.

విశాఖ ఉత్తర నియోజకవర్గంలో టీడీపీ కి ఓటు వేస్తే వైసీపీకి వేసినట్లనని ఆయన వ్యాఖ్యానించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా గంటా శ్రీనివాస రావు ఇటీవలే రాజీనామా చేశారు. డ్రామా కోసమే చేశారు తప్ప వాస్తవం కాదని విమర్శలు రావడంతో అసెంబ్లీ స్పీకర్ ఫార్మాట్ లో ఆయన రాజీనామా చేస్తూ మళ్లీ అందచేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.