FbTelugu

వేడుకల్లో గన్ కాల్పులు కలకలం

కడప: న్యూఇయర్ వేడుకల్లో గన్ కాల్పులు తీవ్ర కలకలం రేపిన ఘటన జిల్లాలోని వీరాపునాయినిపల్లె మండలం, పాయినంపల్లె లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

న్యూఇయర్ వేడుకల్లో స్థానిక మహేశ్వరరెడ్డి, సుధాకర్ రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరుతో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్హణ చోటుచేసుకుంది. దీంతో ఇరువర్గాల వారు కత్తులు, రాళ్లతో పరస్పరం దాడులకు దిగారు. ఈ క్రమంలోనే సుధాకర్ రెడ్డి తన లైసెన్స్ గన్ తో గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు సుధాకర్ రెడ్డి వర్గీయులకు తీవ్ర గాయాలైనాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.