FbTelugu

పాతబస్తీలో గన్ పౌడర్ అక్రమ తయారీ సీజ్

హైదరాబాద్: ఫలక్ నామ పరిధిలోని వట్టేపల్లి లో నడుస్తున్న గన్ పౌడర్ తయారు కేంద్రం పై సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఒక ముఠా గన్ పౌడర్ తయారు ద్వారా డిటోనేటర్ తయారీ చేస్తున్నదని పోలీసులు అనుమానిస్తున్నారు.
షబ్బీర్ అనే వ్యక్తి తయారు చేసిన గన్ పౌడర్ ను కరీంనగర్ కి రవాణా చేస్తున్నాడు. అమ్మోనియం నైట్రేట్, సోడియం సల్ఫేట్ పదార్థం ద్వారా గన్ పౌడర్ తయారు చేస్తున్నట్లు కనుగొన్నారు. పోలీసులు గన్ పౌడర్ ను స్వాధీనం చేసుకుని, షబ్బీర్ ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం ఫాలక్ నామ పోలీసులకు అప్పగించారు.

అయితే దీనికి పేలుడు సామర్థ్యం తక్కువ గా ఉంటుందని తెలిపారు. 2018 లో లైసెన్స్ తీసుకుని, గడువు దాటినా గన్ పౌడర్ ను తయారు చేస్తున్నట్లు చెప్పారు. అక్రమంగా గన్ పౌడర్ తో పాటు డిటోనేటర్ లు రవాణా చేస్తున్నట్లు గుర్తించారు.
జాంబాగ్ లోని ఓ ట్రాన్స్ పోర్టు కంపెనీ ద్వారా కరీంనగర్ కు రవాణా చేస్తున్నాడన్నారు. 25 కాటన్ బాక్స్ లను పాలిష్ పౌడర్ గా చూయించి తప్పుడు పత్రాలు సృష్టించి కరీంనగర్ సరఫరా చేస్తున్నాడని టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.