FbTelugu

అల్లుడికి అత్త క్లీన్ చిట్

విజయవాడ: భార్యను పిస్టల్ తో కాల్చాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న హోమ్ గార్డు వినోద్ కుమార్ చాలా మంచివాడని అత్త క్లీన్ చిట్ ఇవ్వడం సంచలనంగా మారింది.
భవానీ పురంలో బంగారం విషయంలో గొడవలు తలెత్తడంతో భార్య సూర్యరత్నప్రభ ను భర్త వినోద్ కుమార్ పిస్టల్ తో కాల్పులు జరిపినట్లు పోలీసులు నిర్థారించిన విషయం తెలిసిందే. నా అల్లుడు చాలా మంచోడు అని మీడియా ముందు వినోద్ అత్త వరలక్ష్మీ ప్రకటించింది.

తన కుమార్తెను కూడా అత్త మామలు సొంత కూతురిలా చూసుకునేవారని చెప్పింది. నిందితుడి పెద్దత్త, మేనత్త కూడా ఇదే మాటను వల్లించడంతో పోలీసులు కంగుతిన్నారు.
వినోద్ కుమార్ 2019లో సూర్య రత్నప్రభను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పడప్పుడు ఇద్దరి మధ్య పొరపచ్చాలు వచ్చినా సర్దుకుపోయేవారు. గత జనవరిలో మాణప్పురం ఫైనాన్స్ లో భార్య నగలు తాకట్టు పెట్టి అప్పు తెచ్చాడు. ఎస్.బి.ఐ లో తీసుకున్న అప్పును తీర్చడానికి తాకట్టు పెట్టాడు. వచ్చే నెలలో పెద్దనాన్న కుమారుడి వివాహానికి వెళ్లాలని, నగలు కావాలని నిలదీయడంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగి పిస్టల్ తో కాల్పులకు దిగినట్లు పోలీసుల తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.