FbTelugu

సత్తెనపల్లిలో “గన్ కలకలం”

గుంటూరు: సత్తెనపల్లిలో ఆలస్యంగా “గన్ కలకలం”వెలుగులోకి వచ్చింది. శివాలయం వెనుక వీధిలో ఒక ఇంటి వివాదం సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకున్నది.
వాకుమళ్ళ చెంచురెడ్డి ఇంటిని మాధవరెడ్డి అనే వ్యక్తి ఇటీవల కొనుగోలు చేశాడు. డబ్బుల చెల్లింపుపై ఇద్దరి మధ్య గోడవ తలెత్తడంతో మాధవరెడ్డి గన్ తో బెదిరించాడని చెంచురెడ్డి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఫిర్యాదు పరిశీలించిన పోలీసులు ప్రాథమిక విచారణ చేసి నిందితుడిని అరెస్ట్ చేసి గన్ స్వాధీనం చేసుకున్నారు. గన్ ఎక్కడ కొనుగోలు చేశాడు , ఎప్పటినుండి కలిగివున్నాడు అనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.