FbTelugu

మోదీ దుమ్ము దులిపిన గుజరాత్ సమాచార్

న్యూఢిల్లీ: దేశంలో కరోనా సృష్టిస్తున్న విలయంతో జనం అల్లాడిపోతుంటే ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటు సెంట్రల్ విస్టా పనుల్లో బిజీగా ఉన్నారంటూ గుజరాత్ సమాచార్ పత్రి తూర్పారబట్టింది

గుజరాత్ రాష్ట్రంలో గుజరాత్ సమాచార్ పత్రిక అత్యంత ప్రజాధరణ ఉంది. ఆదివారం నాటి సంచికలో ప్రధాన శీర్షికన ప్రత్యేక కథనం రాసింది. ఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పనులకు సంబంధించి ఫొటోలను వరుసగా ప్రచురించింది. పిఎం రూ.22 కోట్ల సెంట్రల్ విస్టా పనుల్లో బిజీ అనే శీర్షకన వెలువడిన కథనం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కరోనా మహమ్మారి తో ప్రజలు చావుబతుకుల మధ్య ఉన్న తరుణంలో ప్రజా సేవకుడు నియంతలా మారిపోతున్నాడంటూ అనే అర్థం వచ్చే విధంగా కథనాన్ని ప్రచురించడం సంచలనంగా మారింది. బిజెపి సీనియర్ నేత, ఎంపి సుబ్రమణ్యస్వామి ఈ వార్తను ట్విటర్ లో షేర్ చేయడం గమనార్హం. గుజరాత్ అత్యంత ప్రజాధరణ కలిగిన దినపత్రిక మోదీపై దాడి చేయడం ఆసక్తికరమని ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. సర్ 2014లో మోదీని ప్రధానిగా ప్రమోట్ చేసినందుకు చింతిస్తున్నారా ఒకరు కామెంట్ పెట్టారు. నేను ఇప్పటికీ ఆయనకు వ్యతిరేకిని కాదు. ఆయన అభ్యర్థన మేరకే 2012 గుజరాత్ అసెంబ్లీ, 2014 వారణాసి ప్రచారానికి వెళ్లానంటూ బదులిచ్చాడు. చాలా మంది ప్రధానులతో ఇలాగే ఉన్నాను, మోదీతో కూడా ఆ విధంగానే ఉన్నానంటూ సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు.

మోదీ నా మాటలు వింటారని ఎంతో ఊహించాను, కాని సాధ్యం కావడం లేదని ప్రజలకు చెబుతున్నానని ప్రతిస్పందించారు. గుజరాత్ సమాచార్ అనే హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. చాలా మంది ప్రశంసిస్తుండగా, రెండు దశాబ్ధాలుగా మోదీకి, బిజెపికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పత్రికలో ఇలాంటి కథనం రావడంలో పెద్ద ఆశ్చర్యమేమి లేదని కాషాయ పెద్దలు సమర్థించుకుంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.