FbTelugu

గిన్నీస్ రికార్డు… నీటి అడుగున రూబిక్స్ క్యూబ్స్!

చెన్నై: రూబిక్ క్యూబ్స్ ను సెట్ చేయడం అంత ఈజీ కాదు. కాని ఒక యువకుడు నీటి తొట్టెలో అడుగున ఆరు రూబిక్ క్యూబ్స్ ను టకటకా సెట్ చేశాడు. ఇంకేముంది ఆయన పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చేరిపోయింది.

చెన్నై నగరానికి చెందిన సేకర్ అనే పాతికేళ్ల యువకుడు ఈ ఛాలెంజ్ సాధించాడు. 2013 సంవత్సరం నుంచి రూబిక్స్ క్యూబ్స్ ను సెట్ చేయడం మొదలు పెట్టాడు. బయట కూర్చుని చేయవచ్చు కాని, నీటి అడుగున ఉండి ఎలా చేయాలనే దానిపై సాధన ప్రారంభించాడు. నీటిలో ఎక్కువ సేపు ఉండేందుకు యోగా సాధన చేశాడు. ఇలా ఒకటి, రెండు నుంచి ఆరు వరకు వరకు నీటి అడుగులో నే పరిష్కరించాడు. దీనికి పట్టిన సమయంలో కేవలం 2 నిమిషాల 17 సెకెన్లు మాత్రమే.

You might also like