FbTelugu

క్లాసులపై వారం రోజుల్లో మార్గదర్శకాలు: హైకోర్టు

హైదరాబాద్: తెలంగాణలో జులై 1 నుంచి పాఠశాలల ప్రారంభంపై హైకోర్టులో విచారణ జరిగింది. పాఠశాలల ప్రారంభంపై విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా హైకోర్టుకు వివరణ ఇచ్చారు.

అన్ని తరగతుల విద్యార్థులు పాఠశాలలకు హాజరు కావాలా అని హైకోర్టు ప్రశ్నించగా, రెండు, మూడు రోజుల్లో విధివిధానాలు ఖరారు చేస్తామని సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు. ప్రత్యక్ష బోధనకు విద్యార్థులు కచ్చితంగా హాజరు కావాల్సిన అవసరం లేదన్నారు. ప్రత్యక్ష బోధనతో పాటు ఆన్ లైన్ బోధన కూడా కొనసాగుతుందని వివరించారు. ఈ విషయంలో విద్యా సంస్థలు తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రత్యక్ష బోధనకు విద్యార్థులు హాజరైతే పాఠశాలల్లో భౌతిక దూరం పాటించడం కష్టమని హైకోర్టు అభిప్రాయ పడింది. హైకోర్టు ఆదేశాల మేరకు విధివిధానాలు ఖరారు చేస్తామని సుల్తానియా తెలిపారు. విధి విధానలు వారం రోజుల్లో సమర్పించాలని విద్యా శాఖను హైకోర్టు ఆదేశించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.