FbTelugu

బంగార్రాజులో సమంతకు గెస్ట్ రోల్!

తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది సమంత. అయితే కరోనా నేపథ్యంలో దాదాపు సినీ పరిశ్రమ మొత్తం కుదేలై.. ఎక్కడి కక్కడ షూటింగులు నిలిచిపోయాయి.

ఈ మధ్యనే అడపాదడపా జరుగుతున్నాయి. అక్కినేని నాగార్జున కథానాయకునిగా నటించిన సోగ్గాడే చిన్ని నాయన సూపర్ హిట్టైన విషయం తెలిసిందే కాగా.. ఈ చిత్ర దర్శకుడు కల్యాణ్ కృష్ణ తాజాగా బంగార్రాజు మూవీని తెరకెక్కించేదుకు సన్నద్ధమైనాడు. ఈ మూవీలో సమంత గెస్ట్ రోల్ లో కనిపించనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఏపాత్ర అనే దానిపై క్లారిటీ లేదు. వేచి చూడాల్సిందే నట.

You might also like