FbTelugu

మరో మారు లక్షకోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు

న్యూఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థ కరోనా కష్టకాలంలోనూ పుంజుకుంటోదనే చెప్పవచ్చు. దానికి సంకేతాలే.. ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ (గూడ్స్ సర్వీస్ ట్యాక్స్/వస్తు సేవల పన్ను) వసూళ్లు మరో మారు లక్షకోట్లు దాటడం.

భారత్ లో గడిచిన నవంబరు నెలలో జీఎ్‌సటీ ఆదాయం రూ.1,04,963 కోట్లుగా ఉందని కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా వెల్లడించింది.
గత ఏడాది నవంబర్ లో జీఎస్టీ వసూళ్లతో పోలిస్తే ఇది 1.4 శాతం అధికమని తెలిపింది. ఇదిలా ఉండగా.. ఆంధ్రప్రదేశ్ లో గతేడాది నవంబర్ నెలతో పోలిస్తే.. ఎస్ జీఎస్టీ 12 శాతం పెరిగింది. తెలంగాణలో గతేడాది నవంబర్ నెలతో పోలిస్తే రాష్ట్ర జీఎస్టీ వసూళ్లు 5.9 శాతం క్షీణించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.