FbTelugu

‘జీశాట్ 30’ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం

ఈ రోజు తెల్లవారుజామున భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రెంచ్ గయానాలో చేపట్టిన జీశాట్-30 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగాన్ని తెల్లవారుజామున 2:35 గంటలకు ప్రారంభించారు. జీశాట్-30 ఉపగ్రహాన్ని ఏరియన్-5 రాకెట్ ద్వారా నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టారు. అయితే. ఇప్పటికే సేవలందిస్తున్న ఇన్‌శాట్-4ఎ స్థానంలో సేవలు అందించేందుకు ఈ భారీ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. జీశాట్-30 ఉపగ్రహం 38 నిమిషాల్లో కక్ష్యలోకి చేరినట్టు ఇస్రో ప్రకటించింది.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More