FbTelugu

ఏడాది పాలనలో అభివృద్ధి సున్నా: యనమల

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ఏడాది పాలనలో అభివృద్ధి శూన్యమని టీడీపీ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

ఏపీలో అన్ని రంగాలనూ వైసీపీ భ్రష్టు పట్టించిందని ఆరోపించారు. అభివృద్ధి లేదు. ఉన్న పథకాలలో కోత పెట్టారని అన్నారు. నా రాజ్యం నాఇష్టం అన్నట్టుగా జగన్ పాలన ఉందని ఎద్దేవా చేశారు. అన్ని రాజ్యాంగ సంస్థలపై జగన్ ఎదరుదాడి చేస్తున్నారని అన్నారు.

You might also like