FbTelugu

బ్యూటిఫుల్ హీరోయిన్ కు శుభాకాంక్షలు

నా డియరెస్టు అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ రమ్యకృష్ణ కు దర్శకుడు కె.రాఘవేంద్ర రావు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.

ఈ మేరకు రాఘవేంద్ర రావు ట్వీట్ చేస్తూ, రోజ్ రోజ్ రోజా పువ్వా నుంచి మమతల తల్లి వరకు, ఎన్నేళ్లు గడిచినా మన ప్రయాణం చెదరనంత గొప్పదని గుర్తు చేశారు. భవిష్యత్తులో మరిన్ని ప్రముఖ పాత్రలో ప్రపంచాన్ని అలరించాలని అభిలాషించారు. రమ్యకృష్ణ తన 50 జన్మదినం సందర్భంగా జరిగిన వేడుకల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. నటీమణిగా తెలుగు, తమిళం, హిందీ, మళయాళ చిత్రాల్లో నటించింది. వైవిధ్యమైన పాత్రల్లో నటించి పేరును సంపాదించుకున్నది. మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.