FbTelugu

దర్శకుడు వెంకీ కుడుములకు చిరూ నుంచి గ్రీన్ సిగ్నల్ ?

దర్శకుడు వెంకీ కుడుములకు చిరూ నుంచి గ్రీన్ సిగ్నల్ ?

తెలుగులో లవ్ ఎంటర్ టైనర్ చిత్రాలను తనదైన శైలిలో తెరపై ఆవిష్కరించి, యూత్ నుంచి మంచి మార్కులు కొట్టేస్తుంటాడు వెంకీ కుడుముల. నాగశౌర్య హీరోగా ఆయన చేసిన ‘ఛలో’ .. నితిన్ హీరోగా తెరకెక్కించిన ‘భీష్మ’ సినిమా లు భారీ విజయాలను అందుకున్నాయి. నాన్ స్టాప్ గా ఈ సినిమాలు ఎంటర్టైన్ చేశాయి ప్రేక్షకులని. వెంకీ కుడుముల ఇటీవల చిరంజీవికి ఒక కథను వినిపించి ఓకే అనిపించుకున్నాడనే టాక్ వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ షూటింగులో ఉన్నారు. రీసెంట్ గా ‘భోళా శంకర్’ సినిమాను కూడా పట్టాలెక్కించారు.

ఆ తరువాత ఆయన బాబీ ప్రాజెక్టుతో సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఈ సినిమా తరువాత మారుతి ప్రాజెక్టు ఉండవచ్చు. మెగాస్టార్ నుంచి తనకి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పాడు. తాజా ప్రచారంలో నిజమే ఉంటే, ఇవన్నీ పూర్తయిన తరువాతనే వెంకీ కుడుములతో సినిమా ఉండొచ్చేమో అని అనుకుంటున్నారు సినీ జనాలు.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.