FbTelugu

పసుపు కొనుగోళ్లకు గ్రీన్ సిగ్నల్

నిజామాబాద్: పసుపు కొనుగోళ్లకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపటినుంచి నిజామాబాద్ పసుపు మార్కెట్ యార్డులో పసుపు కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.

అయితే ఇతర రాష్ట్రాల రైతులకు మార్కెట్ లోకి అనుమతి లేదని తెలిపారు. అదేవిధంగా ప్రతి రోజూ 10 వేల బస్తాలు మాత్రమే మార్కెట్ లోకి అనుమతించనున్నట్టు తెలిపారు. ఉదయం 7:00 గంటల నుంచి 11:00 గంటల వరకు మాత్రమే పసుపు కొనుగోళ్లు జరుగుతాయని తెలిపారు. ఇక పసుపు రైతులు ఆందోళన చెందవద్దని అధికారులు సూచించారు.

You might also like