FbTelugu

ఏపీలో ఆర్టీసీ బస్సులకు గ్రీన్ సిగ్నల్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ బస్సులకు నడపాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బస్సు సర్వీసులపై విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.అయితే బస్సులో సగం సీట్లు మాత్రమే నింపి బస్సులు నడపాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ప్రైవేట్ బస్సులకు కూడా అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రతి ఆర్టీసీ బస్సులో గరిష్టంగా 20 మందికి మాత్రమే అనుమతించనున్నట్టు తెలిపారు. కచ్చితంగా భౌతిక దూరం పాటించాల్సిందేనని సూచించారు. బస్సుల్లో ప్రయాణించే వారు మాస్కు తప్పనిసరిగా ఉపయోగించాలన్నారు. బస్టాండ్‌లో దిగగానే స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. దశలవారీగా సర్వీసులు పెంచాలని అధికారులకు సీఎం ఆదేశించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.