FbTelugu

స్వదేశీ వ్యాక్సిన్ కు కేంద్రం ఓకే

న్యూఢిల్లీ: దేశీయంగా తయారైన కరోనా వ్యాక్సిన్ కు సూత్రప్రాయంగా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శుక్రవారం నాడు ఆక్స్ ఫర్డ్ – ఆస్ట్రాజెనెకా తయారు చేసిన వ్యాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం ఇవాళ భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ కు సిఫారసు చేసింది.

కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్సీఓ) ఆధ్వర్యంలోని నిపుణుల బృందం ఇవాళ భేటీ అయింది. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ కొవాగ్జిన్ వ్యాక్సిన్ అనుమతి కోసం సమర్పించిన పత్రాలను నిపుణుల బృందం పరిశీలిచింది. అయితే ఇప్పటి వరకు రెండు దశల ప్రయోగాలు పూర్తి కాగా మూడో దశ ప్రయోగాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. రెండు దశల ఫలితాల్లో ఆశాజనకంగా నివేదికలు రావడంతో అత్యవసర వినియోగానికి నిపుణుల బృందం సిఫారసు చేసింది.
దీంతో అనుమతించే బాధ్యత భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) వద్దకు చేరింది. డీసీజీఐ ఆమోదం లభిస్తే మార్కెటింగ్, ఉత్పత్తి కోసం అనుమతులు పొందాల్సి ఉంటుంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.