హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయకు
త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. నల్లగొండలో తనకు జరిగే పౌర సన్మానం కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుండి నల్లగొండకు వెళ్తుండగా.. చౌటుప్పల్ మండలం ఖైతాపురం గ్రామ శివారులో
జాతీయ రహదారిపై దత్తాత్రేయ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు కిందికి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులోని బండారు దత్తాత్రేయకు ఎలాంటి గాయాలు కాలేదు. ఆయన ప్రయాణిస్తున్న కారు స్టీరింగ్ ఒక్కసారిగా బిగుసుకు పోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. ప్రమాదం అనంతరం వేరే కారులో దత్తాత్రేయ వేరే కారులో నల్లగొండకు వెళ్లారు.