FbTelugu

ప్రారంభమైన గ్రేటర్ ఓట్ల లెక్కింపు

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత బ్యాలెట్ ఓట్ల లెక్కింపును కౌంటింగ్ సిబ్బంది ప్రారంభించారు.

ఈ నెల 1న 149 డివిజన్లలో ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగా, 3వ తేదీన ఓల్డ్ మలక్ పేటలో రీ పోలింగ్ నిర్వహించిన విషయం విదితమే. ఉదయం 11 గంటల తర్వాత తొలి రౌండ్ ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 1,926 పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. కౌంటింగ్ సమయానికి వచ్చే వాటిని పరిగణనలోకి తీసుకుని తొలుత వాటిని లెక్కిస్తారు. అనంతరం బ్యాలెట్ బాక్సులను తెరిచి లెక్కింపు ప్రారంభిస్తారు.

ఓట్ల లెక్కింపునకు మొత్తం 30 సర్కిళ్లలో 150 హాళ్లను సిద్ధం చేశారు. చాలా డివిజన్లలో ఓటింగ్ శాతం భారీగా తగ్గడంతో రెండు రౌండ్లలోనే పూర్తి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే మూడు రౌండ్లలోనే ఫలితం తేలిపోనుంది. కరోనా వైరస్ నేపథ్యంలో లెక్కింపు కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.