FbTelugu

గ్రేటర్ హైదరాబాద్@40 కేసులు

హైదరాబాద్: కరోనా పాజిటివ్ కేసులు 40 దాకా నమోదు అయినట్లు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 33 మందికి పాజిటివ్ రాగా, వలస వచ్చిన వారికి 7 గురికి వ్యాధి వచ్చిందని ప్రభుత్వం తెలిపింది. జిల్లాల్లో ఎక్కడ కూడా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని పేర్కొంది. మొత్తం 1454 కేసులు నమోదు కాగా, 959 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. ఈరోజు 13 మంది డిశ్చార్జీ కాగా ఇంకా 461 మంది చికిత్స తీసుకుంటున్నారు. మొత్తం 34 మంది చనిపోగా, ఇవాళ ఒక్కరు కూడా చనిపోలేదు.

You might also like