FbTelugu

ముగిసిన గ్రేటర్ ప్రచారం

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల బరిలో 150 డివిజన్లలో 1,893 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనున్నది.

కోవిడ్ నేపథ్యంలో బ్యాలెట్ పద్ధతిలోనే పోలింగ్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ సి.పార్థసారథి తెలిపారు. పోలింగ్ కోసం మొత్తం 9 వేల 101 కేంద్రాలు ఏర్పాటు చేశామని, అత్యధికంగా కొండాపూర్ డివిజన్ లో 99 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు.  పోలింగ్ విధుల్లో 45 వేల సిబ్బంది ఉంటారని, ఎల్ఐసీ వంటి సంస్థల నుంచి ఉద్యోగులను నియమించుకున్నామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 74 లక్షల 4 వేల 286 మంది ఓటర్లు ఉండగా, అతిపెద్ద డివిజన్ మైలార్‌దేవ్‌పల్లి, అతి చిన్న డివిజన్ ఆర్సీపురం అన్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఫేస్ రికగ్నిషన్ యాప్ ఏర్పాటు చేశామన్నారు. వికలాంగులు, వృద్దులకు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక నీల్ చైర్లు ఉంటాయని అన్నారు. గ్రేటర్ పరిధిలో ఇప్పటికే ఓటర్లకు ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తయ్యిందని పార్థసారథి వివరించారు.

 

 

You might also like

Leave A Reply

Your email address will not be published.