FbTelugu

గ్రేటర్ ఎగ్జిట్ ఫలితాలు వచ్చేశాయ్…

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఓల్డ్ మలక్ పేటలో రీ పోలింగ్ పూర్తయిన వెంటనే పలు సంస్థలు ఫలితాలు ప్రకటించాయి.

మెజారిటీ సంస్థలు టీఆర్ఎస్ ముందంజలో ఉన్నట్లు వెల్లడించడం విశేషం. సీపీఎస్ సర్వే ప్రకారం టీఆర్ఎస్ కు 82-96, ఎంఐఎం 32-36, బీజేపీ 12-20, కాంగ్రెస్ 3 – 5 సీట్లు రానున్నాయి. ఆరా సర్వేలో టీఆర్ఎస్ 78, బీజేపీ 28, ఎంఐఎం 41, కాంగ్రెస్ 3 గెలుచుకోనున్నాయి. పల్స్ టుడే ప్రకారం టీఆర్ఎస్ 86-90, ఎంఐఎం 34-38, బీజేపీ 18-20, కాంగ్రెస్ 1-2 సీట్లు రానున్నాయి. బెల్లిపుల్ సర్వే లో టీఆర్ఎస్ 82-84, ఎంఐఎం 32, బీజేపీ 14, కాంగ్రెస్ 4 డివిజన్లలో విజయం సాధించనున్నట్లు పేర్కొంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా డబుల్ బెడ్రూమ్ లు, ట్రాఫిక్ సమస్య, వరద సాయం ప్రభావం చూపించినట్లు సర్వే సంస్థలు వెల్లడించాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.