FbTelugu

ప్రశాంతంగా ముగిసిన గ్రామపంచాయతీ ఎన్నికలు

అమరావతి: రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఈ నెల 9,13,17,21 తేదీల్లో నాలుగు విడతలుగా ఎన్నికలు నిర్వహించింది.

రాష్ట్రంలో మొత్తం 660 మండలాల్లోని 13 వేల371 గ్రామపంచాయతీల ఎన్నికల కోసం 13 వేల 97 నోటిఫై చేసింది. 2వేల146 ఏకగ్రీవాలు కాగా,10 వేల 951 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్రంలో ఒక లక్షా 34వేల 57 వార్డులకు గాను ఒక లక్షా 10వేల 706 వార్డులను నోటిఫై చేసింది. మొత్తం 27వేల 756 వార్డులు ఏకగ్రీవం కాగా 82వేల 950 స్థానాలకు ఎన్నికలు జరిపారు. మొదటివిడత పోలింగ్ లో 81.67 శాతం, రెండో విడత 81.67 శాతం, మూడో విడత 80.71 శాతం కాగా ఇవాల్టీ నాలుగో విడతలో పోలింగ్ 80 శాతం దాటింది. తదుపరి మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సమాయత్తమవుతోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.