FbTelugu

నేటి నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

తూర్పు గోదావరి: జిల్లాలో నేటి నుంచి ధాన్యం కొనుగోళ్లు జరుపనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోలు చేయడానికి జిల్లాలో మొత్తం 271 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

రైతులు తీసుకువచ్చే ధాన్యానికి కనీస మద్దతు ధరను కల్పిస్తామంటూ.. అధికారులు తెలుపుతున్నారు. మద్దతు ధరే లక్ష్యంగా చర్యలు చేపట్టినట్టు తెలిపారు.

You might also like