FbTelugu

క్రమంగా పెరుగుతున్న శ్రీవారి హుండీ ఆదాయం

తిరుపతి: కరోనా నేపథ్యంలో విధించిన ఆంక్షల కారణంగా గత కొంతకాలంగా శ్రీవారిని దర్శించుకునే భక్తులు సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో శ్రీవారి హుండీ ఆదాయం కూడా తగ్గిపోయింది.

కాగా క్రమంగా హుండీ ఆదాయం పెరుగుతోంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.92 లక్షలుగా ఉంది. నిన్న శ్రీవారిని 14,174 మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు.

You might also like