FbTelugu

మహారాష్ట్రలో క్రమంగా లాక్ డౌన్ ఎత్తివేత

ముంబయి: కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపులు ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. మొత్తం ఐదు స్థాయిల్లో సడలింపులు అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.

కరోనా పాజిటివ్ కేసులు ఐదు శాతం అంతకన్నా తక్కువగా ఉన్నట్లయితే ఆ జిల్లాల్లో పూర్తిగా లాక్ డౌన్ ఎత్తివేస్తారు. ఎలాంటి నిబంధనలు లేకుండా అన్నీ తెరుచుకునేందుకు అనుమతిస్తారు. ఐదు శాతం పాజిటివ్ కేసులు, ఆసుపత్రులలో 40శాతం లోపు పడకలు నిండి ఉండి ఉంటే 144 సెక్షన్ అమలు చేసి, 50 శాతం సామర్థ్యంతో థియేటర్లు, రెస్టారెంట్లు తెరుచుకోవచ్చు. సాధారణ సమయాల్లో దుకాణాలు నిర్వహించుకునేందుకు అనుమతిస్తారు. పాజిటివ్ కేసులు 5 నుంచి 10 శాతం లోపు ఉన్నట్లయితే సాయంత్రం 4 గంటల వరకు దుకాణాలు తెరిచి ఉంటాయి కాని మాల్స్, థియేటర్లు మూసివేస్తారు. పాజిటవ్ కేసులు 10 నుంచి 20 శాతం ఉంటే ఆ జిల్లాల్లో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ అమలు చేస్తారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.