FbTelugu

ఆన్ లైన్ లో టెన్త్ విద్యార్థులకు గ్రేడ్లు

హైదరాబాద్: తెలంగాణలో ఎస్ఎస్సీ విద్యార్థుల గ్రేడ్లు ఖరారు చేశారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి ఇంటర్మీడియెట్ వెబ్ ఫోర్టల్ (www.bse.telangana.gov.in) లో వివరాలు చూసుకునే వెసులుబాటు కల్పించారు.

మెమోలు మాత్రం సంబంధిత పాఠశాల నుంచే తీసుకోవాల్సి ఉంటుంది. ఏమైనా పొరపాట్లు ఉన్నట్లయితే ఎస్ఎస్సీ బోర్డుకు ఫిర్యాదు చేయాలి. కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్రంలో ఎస్ఎస్సీ పరీక్షలు రద్దు చేశారు. యూనిట్ టెస్టులలో విద్యార్థులు సాధించిన మార్కులు ఆధారంగా విద్యార్థుల గ్రేడ్లు నిర్ణయించారు.

You might also like