FbTelugu

‘అయోద్య తీర్పు వచ్చేనాటికి ప్రభుత్వం ఏర్పడాలి’

Govt-Should-be-formed-at-the-time-of-impeachment

ముంబయి: మరో పది రోజుల్లో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడాలని శనివారం శరద్ పవార్ పేర్కొన్నారు. నవంబర్ 9 న అయోద్య తీర్పు రానుండటంతో ప్రజల శాంతి భద్రతలకు భంగం వాటిల్లే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. శివసేన, ఎన్సీపీ అధినేతలు ఉద్ధవ్‌ ఠాక్రే, శరద్‌ పవార్ గురువారం సమావేశమై రాష్ట్రంలోని పరిస్థితులపై చర్చించినట్లు వస్తున్న వార్తలను పవార్‌ ఖండించారు. అసలు తమ మధ్య ఎటువంటి సంభాషణ జరగలేదని తెలిపారు. వీరిద్దరి మధ్య ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి చర్చలు జరిగినట్లు వస్తున్న వార్తలకు ఆయన చెక్‌ పెట్టారు. శివసేన నుంచి ఎటువంటి ప్రతిపాదనా రాలేదన్నారు. శివసేన డిమాండ్‌ విషయంలో భాజపా దిగొస్తుందని జోస్యం చెప్పారు. చిన్నపిల్లల ఆటలు కట్టిపెట్టి వీలైనంత త్వరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. తాను ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షాలతో చర్చించినట్లు వస్తున్న వార్తల్లోనూ నిజం లేదని తెలిపారు. తాను తాజాగా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో మాత్రమే మాట్లాడినట్టు పేర్కొన్నారు. నవంబర్‌4న విపక్షాల సమావేశం సందర్భంగా తమ భేటీ జరిగిందన్నారు.

You might also like