FbTelugu

శారదాపీఠం ఒక డూప్లికేట్: గోవిందానంద

హైదరాబాద్: రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను తానే గెలిపించి అధికారంలోకి తీసుకువచ్చానని చెబుతున్న విశాఖా శారదా పీఠం అధిపతిపై గోవిందానంద సరస్వతి దారుణంగా దూషించారు.
విశాఖ శారదా పీఠం ఒక డూప్లికేట్ అని, దేశంలో ఇలాంటి డూప్లికేట్ పీఠాలు చాలా ఉన్నాయని ఆయన అన్నారు. స్వరూపానందేంద్ర సరస్వతి శంకరాచార్యులు కారని, నెంబర్ వన్ డూప్లికేట్ గాడన్నారు. ఆంజనేయ స్వామి జన్మస్థలంపై టిటిడి, కిష్కింధ సంస్థాన్ ట్రస్టు మధ్య వివాదం జరుగుతున్న విషయం విదితమే. ఈ రగడపై హనుమత్ జన్మస్థల తీర్థక్షేత్ర ట్రస్టు వ్యవస్థాపకులు గోవిందానంద సరస్వతి మీడియాతో మాట్లాడారు. స్వరూపానంద ఎక్కడో సన్యాసం తీసుకుని విశాఖపట్నంలో సాధన చేశారని, మంత్రాలతో ఆయన జనాలను నిండా మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు.

హనుమంతుడి జన్మస్థలంపై తాము వేసిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక స్వరూపానందేంద్ర సరస్వతి పారిపోయారని గోవిందానంద అన్నారు.
హనుమంతుడి జన్మస్థలంపై టిటిడిది తొందరపాటేనని ఆయన తప్పుపడుతూ, తప్పుడు మార్గంలో వెళ్లారని ఆయన విమర్శించారు. ఈ వివాదం మొదలైన తరువాత గోవిందానంద సంచలన వ్యాఖ్యలు చేశారు. టిటిడి ప్రచూరించిన పుస్తకంలో అన్నీ తప్పులేనని చెప్పారు. సంపూర్ణ అవగాహన, పరిశోధన చేయకుండా జన్మస్థలాన్ని ప్రకటించారని మండిపడ్డారు. వెంకటాచలం మహత్యం బుర్రలేనివారు రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిటిడి రామాయాణాన్ని కూడా ప్రమాణంగా తీసుకోవడం లేదని గోవిందానంద చురకలు అంటించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.