తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారిని ఇవాళ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిలిసై సౌందర రాజన్ దర్శించుకున్నారు. శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందగా ఉందన్నారు. ఇతర దేశాల సహాయం లేకుండా మనదేశంలో కరోనా వ్యాక్సిన్ తయారు అవడం చాలా సంతోషకర విషయమన్నారు. వ్యాక్సిన్ రావడానికి సహకరించిన మోదీకి, డాక్టర్స్, ఫ్రంట్లైన్ వారియర్ కు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు.