FbTelugu

కేసీఆర్ నాయకత్వం భేష్: గవర్నర్

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో సమగ్ర అభివృద్ధి జరిగిందని గవర్నర్ తమిలి సై సౌందర రాజన్ అన్నారు.
అసెంబ్లీలో ఉభయసభలనుద్దేశించి గవర్నర్ తమిళి సై మాట్లాడారు. ఆరున్నర ఏళ్లలో జరిగిన అభివృద్ధి కళ్ల ముందు ఉందన్నారు. అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా పరిపాలన కొనసాగుతున్నదన్నారు. సాధించిన విజయాలు అన్నీ ఒక్కరోజులో సాధించింది కాదన్నారు. అన్నివర్గాల ప్రజల పురోగతికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది.
కేసీఆర్‌ సారథ్యంలో అనేక వినూత్న పథకాలు రూపొందించాం. ఆరున్నర ఏళ్ల మేధోమథనం ఫలితంగానే తెలంగాణ దూసుకెళ్తోంది. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారంపై దృష్టి సారించాం. వనరుల సద్వినియోగం ద్వారా రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్తోంది. ఈ ఏడాదికి రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2 లక్షల 28 వేలకు పెరిగింది.
ఆర్థిక నిర్వహణలో క్రమశిక్షణ పాటిస్తున్నాం. కోవిడ్‌ వల్ల అనేక రాష్ట్రాలు ఇబ్బంది పడ్డాయి. తెలంగాణ మాత్రం వ్యూహాత్మకంగా అడుగులు వేశాం. విద్యుత్‌ రంగంలో తెలంగాణ అద్వితీయ విజయాలు సాధించింది. అతి తక్కువ సమయంలో క్లిష్టమైన సమస్యలను అధిగమించాం. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ అందిస్తున్నాం. రెవెన్యూ వసూళ్లలో రాష్ట్ర అగ్రగామిగా ఉంది. సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. సమైక రాష్ట్రంలో ప్రాజెక్టులను పట్టించుకోలేదు.

పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేసి 20లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చాం. కరువు ప్రాంతాలకు కూడా సాగునీరు ఇచ్చాం. భక్త రామదాసు ప్రాజెక్ట్‌ 7 నెలల్లో పూర్తి. త్వరలోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ పూర్తి. డిండి, సీతారామ ఎత్తిపోతలను పూర్తి చేస్తాం. తెలంగాణలో 2.10 లక్షల ఎకరాల్లో పంటల సాగు, తెలంగాణలో 39,36,521 మందికి పెన్షన్లు. పెన్షన్ల కోసం ప్రతి ఏటా రూ.8,710 కోట్లు కేటాయింపు. ధాన్యం సేకరణలో తెలంగాణ తొలిస్థానంలో ఉంది. 64 లక్షల టన్నుల ధాన్యం సేకరణ జరిగిందని గవర్నర్ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.