FbTelugu

గవర్నర్ లాల్జీ టండన్ కన్నుమూత

భోపాల్: మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టండన్ (85) కన్నుమూశారు. కొద్ది రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.
లాల్జీ మరణించినట్లు ఆయన కుమారుడు, ఉత్తరప్రదేశ్ మంత్రి అశుతోష్ టండన్ ట్వీట్ చేశారు. లక్నోలోని మేదాంత హాస్పిటల్ లో జూన్ 11న చేర్చారు. శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు పడుతుండడంతో ఆయనకు మేదాంత హాస్పిటల్ లో చేర్చిన విషయం తెలిసిందే.
వైద్యులు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆయన కోలుకోకపోగా రోజు రోజుకు మరింతగా దిగజారింది. మరింత క్షీణించడంతో ఇవాళ తెల్లవారు జామున 5.35 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు.
ఉత్తరప్రదేశ్ గవర్నర్ అనందీ బెన్ పటేల్ కు మధ్యప్రదేశ్ అదనపు బాధ్యతలు అప్పగించారు. తదుపరి గవర్నర్ ను నియమించే వరకు ఆమె కొనసాగుతారు.

You might also like