FbTelugu

సిబిఐ ఆఫీసుపై రాళ్లదాడిని ఖండించిన గవర్నర్

కొలకతా: పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు ముగిసినా టిఎంసి, బిజెపి మధ్య రాజకీయ వైరం ఆగడం లేదు. నువ్వా నేనా అనే విధంగా రాష్ట్రంలో అధికార టిఎంసి, బిజెపి తలపడుతుండడం గమనార్హం.

కొలకతాలోని సిబిఐ ఆఫీసు పై టిఎంసి కార్యకర్తల రాళ్ల దాడిని గవర్నర్ జగదీప్ ధన్కర్ తీవ్రంగా ఖండించారు. సిఎం మమతా బెనర్జీ కళ్ల ముందే దాడి జరగడం శోచనీయమన్నారు. రాళ్లు, కర్రలతో దాడులు చేస్తుంటే రాష్ట్ర పోలీసులు ప్రేక్షకుల్లా ఉండిపోయారన్నారు. వెంటనే శాంతి భద్రతలు పునరుద్ధరించాలని పోలీసులను ఆయన ఆదేశించారు. నారదా స్టింగ్ ఆపరేషన్ కేసులో టిఎంసికి చెందిన మంత్రి ఫిర్హాద్ హకీం, నాయకులను సిబిఐ అధికారులు ఇవాళ ఉదయం అదుపులోకి తీసుకున్నారు. వారి అరెస్టును నిరసిస్తూ సిఎం మమతా బెనర్జీ సిబిఐ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. బిజెపి ఓటమిని జీర్ణించుకోలేక తమ నాయకులను అరెస్టు చేసి పగ తీర్చుకుంటున్నదని మమతా ఆరోపించారు. మంత్రి ఫిర్హాద్, ఇతర నాయకులను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా డౌన్ డౌన్ అంటూ నినదించారు. ఈ నేపథ్యంలో కొందరు సిబిఐ ఆఫీసుపై రాళ్లదాడి చేశారు. ఈ ఘటనలో పలువురి గాయాలు కావడంతో ఉద్రిక్తత నెలకొన్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.