FbTelugu

భారత్ బయోటెక్ కు గవర్నర్ అభినందనలు

హైదరాబాద్‌: కరోనాపై పోరుకు వ్యాక్సిన్ సిద్ధం చేస్తున్న భారత్ బయోటెక్ కు రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ అభినందనలు తెలిపారు.

భారత్ బయోటెక్ సంస్థ రూపొందిస్తున్న కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను మానవులపై ప్రయోగించేందుకు అనుమతి లభించిన విషయం తెలిసిందే. కొవాక్సిన్ పేరిట అభివృద్ధి చేసిన దీన్ని జులై నెలలో మనుషులపై ప్రయోగించనున్నారు. దేశీయంగా తొలిసారిగా కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ తయారు చేసిన భారత్ బయోటెక్ సంస్థకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రశంసించారు. హైదరాబాద్‌లోని జెనోమ్ వ్యాలీకి చెందిన ఈ సంస్థ ఐసీఎంఆర్, పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో కలిసి వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిందని తమిళిసై తెలిపారు.

You might also like