FbTelugu

అయ్యప్పను దర్శించుకున్న గవర్నర్ ఆరిఫ్

తిరువనంతపురం: ఆయన ఒక రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్నారు. రాష్ట్ర ప్రథమ పౌరుడు. ముస్లిం అయినా పరమత సహనంతో హిందువుల ఆరాధ్య దైవం శబరిమల అయ్యప్పను దర్శించుకున్నాడు. ఆయనే కేరళ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్.
ఆదివారం నాడు గవర్నర్ ఆరిఫ్ తన తల మీద ఇరుముడి పెట్టుకుని శబరిమలలో 5 కిలోమీటర్లు నడుచుకుంటూ సన్నిధి వరకు వెళ్లారు.

మెట్లు ఎక్కుతున్న సందర్భంలో ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఎలాగొలా ఎక్కారు. ఆలయంలో పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల తరువాత గవర్నర్ ఆరిఫ్ ను దేవస్థానం బోర్డు సభ్యులు, అధికారులు కండువాతో సత్కరించి, ఆలయ మర్యాదలతో గౌరవించారు. గవర్నర్ రాక సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.