FbTelugu

రుయా ఘటనపై గవర్నర్, చంద్రబాబు దిగ్భ్రాంతి

అమరావతి: తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా అకస్మాత్తుగా ఆపేయడంతో 11 మంది కరోనా రోగులు మృతి చెందిన ఘటన పై గవర్నర్ బిస్వ భూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసు కోవాల్సిందిగా అధికారులను గవర్నర్ ఆదేశించారు.

ఏపీలో వైసిపి ప్రభుత్వం అక్రమ కేసులపై పెట్టిన శ్రద్ధ.. ఆక్సిజన్‌ సరఫరాలో చూపట్లేదని టిడిపి అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడు తూర్పారపట్టారు. రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక 11 మంది మృతి చెందిన ఘటనపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఆక్సిజన్‌ అందక కరోనా పాజిటివ్ రోగులు మృతి చెందడం అత్యంత బాధాకరం అన్నారు. ఈ ఘటన ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని, యుద్ధప్రాతిపదికన ఆక్సిజన్‌ అందించి కొవిడ్‌ బాధితులను కాపాడాలని చంద్రబాబు సూచించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.