FbTelugu

‘రాయితీలపై ప్రభుత్వం అలసత్వం’: ఏపీ ఎన్జీఓ

Governments-slogan-on-subsidies-says-AP-NGO

విజయవాడ: ఉద్యోగులకు రావాల్సిన రాయితీల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ అన్నారు. దీనిపై ఏపీ ఎన్జీవో జేఏసీ జనరల్ బాడీ మీటింగ్ జరిగిన అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ నెల 22 తేదీన బ్లాక్ బ్యాడ్జీలు ధరించి కార్యాలయల్లో నిరసన తెలుపుతామన్నారు. 29వ తేదీన తాలుకా కేంద్రాలలో ధర్నాలు చేపట్టనున్నట్టు, సెంబర్ 10న కలెక్టర్ కార్యాలయల ముందు ధర్నాలు చేయనున్నట్టు తెలిపారు. డిసెంబర్ 20న రాష్ట్ర స్థాయిలో ధర్నా చౌక్ లో నిరసన తెలువుతామన్నారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లను తెలిపారు. అవి పీఆర్సీ 55 శాతం అమలు చేయాలి. 3 వితలు రావాలిసిన డిఏ ను విడుదల చేయాలి. సీపీఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులైజ్ చేయాలి. మహిళా ఉద్యోగులకు 5 రోజుల అదనపు సియల్ లీవులు కేటాయించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషుతో పాటు తెలుగు సైతం కొనసాగించాలి.

You might also like