FbTelugu

ప్రభుత్వ టీచర్ ఏకకాలంలో 25 స్కూళ్లలో విధులు!

లక్నో: ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఏకకాలంలో 25 స్కూళ్లలో విధులు నిర్వహిస్తున్నట్టుగా రికార్డులు సృష్టించింది. ఒక్క ఏడాదిలోనే ఏకంగా సుమారు కోటి రూపాలయలు దండుకుని అధికారులకు అడ్డంగా బుక్కయింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. అనామిక శుక్లా అనే ఉపాధ్యాయురాలు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (కేజీబీవీ)లో సైన్స్ టీచర్ గా పనిచేస్తోంది.

కాగా ఇటీవల టీచర్లకు సంబంధించిన డేటా బేస్ సిద్ధం చేస్తుండగా అధికారులకు కళ్లు బయళ్లు కమ్మే విషయం ఒకటి తెలిసింది. అనామిక పేరు మరో 24 స్కూళ్లలోని టీచర్ల జాబితాలో ఉన్నట్టు గుర్తించారు. దీనిపై విచారణ చేయగా ఆ టీచర్ 13 నెలల కాలంలో ఏకంగా కోటి రూపాయల శాలరీ తీసుకున్నట్టు గుర్తించారు. అయితే ఆమె ఒక్కతే ఈ పనిచేయడం కష్టమని ఈ తంతులో ఇతరుల హస్తం గురించి విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.

You might also like