FbTelugu

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి: ఉత్తమ్

హైదరాబాద్: అకాల వర్షాలతో తడిసిపోయిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నేడు హైదరాబాద్ లో బీఆర్కే భవన్ లో సీఎస్ తో విపక్షనేతల భేటీ ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై చర్చించారు.

ఈ సందర్భంగా కరోనాతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ప్రతి పేద కుటుంబానికి రూ.5 వేలు అందించాలని అన్నారు. కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని సూచించారు. తెలంగాణలో కరోనా పరీక్షలు సక్రమంగా చేయడం లేదని ఆరోపించారు. ఈ సమావేశానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎల్ రమణ, చాడ వెంకట్ రెడ్డి హాజరైనారు.

You might also like