FbTelugu

తెలంగాణలో యాధావిధిగా ప్రభుత్వ ఆఫీసులు

హైదరాబాద్: సోమవారం నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు యాధావిధిగా కొనసాగనున్నాయి. గ్రీన్, ఆరెంజి జోన్లలో ప్రభుత్వ కార్యాలయాలు తెరవాలని, వంద శాతం సిబ్బంది హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశించింది.

రెడ్ జోన్ లో మాత్రం 33 శాతం సిబ్బంది ప్రతిరోజు హాజరవుతారు. రోటేషన్ పద్ధతిలో ఉద్యోగులు విధుల్లో ఉండనున్నారు. ఆదాయం పడిపోవడం, జీతాలు చెల్లించేందుకు కూడా రాబడి లేకపోవడంతో ప్రభుత్వం కార్యకలాపాలను క్రమంగా పెంచాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం కూడా నిబంధనలు సడలించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.

You might also like