FbTelugu

ముస్లిం యువతులకు కూడా డ్రైవింగ్ లైసెన్స్

రియాద్: సౌది అరేబియా ప్రభుత్వం యువతుల విషయంలో మరో నిర్ణయం తీసుకున్నది. ఇక నుంచి 17 సంవత్సరాలు నిండిన యువతులకు కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వనున్నారు. డ్రైవింగ పర్మిట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సౌదీ ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ ప్రకటించింది.

సౌది అరేబియాలో మహిళలు డ్రైవింగ్ చేసేందుకు వీలుగా 2017లో ప్రత్యేక చట్టాన్ని తీసుకున్నారు. మతఛాందసవాద దేశంలో ఇప్పటి వరకు మహిళలకు డ్రైవింగ్ చేసుకునే హక్కు లేదు. ఏడాది పాటు తాత్కిలక డ్రైవింగ్ పర్మిట్ ఇస్తారు. 18 సంవత్సరాలు నిండిన తరువాత పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేస్తారు. దరఖాస్తు చేసుకునే సమయానికి యువతులు డ్రగ్స్ కు సంబంధించిన కేసులు ఉండకూడదు, ట్రాఫిక్ ఉల్లంఘనల జరిమానాలు ఉన్నట్లయితే చెల్లించాల్సి ఉంటుంది. విదేశాల నుంచి వచ్చినవారు అయితే రెసిడెన్సీ పర్మిట్ అందచేయాలి. దరఖాస్తు చేసుకునే ముందు డ్రైవింగ్ స్కూళ్లలో ఆన్ లైన్ టెస్టు పాస్ కావాల్సి ఉంటుందని సౌదీ ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ వెల్లడించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.