FbTelugu

అమర జవాన్ భార్యకు సర్కార్ ఉద్యోగం: మంత్రి ధర్మాన

శ్రీకాకుళం: కార్గిల్ అమరుడైన ఆర్మీ జవాన్ ఉమా మహేశ్వర్ రావు భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ప్రకటించారు. ఉద్యోగంతో పాటు 350 చదరపు గజాల నివాస స్థలం, రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రభుత్వం తరఫున అందచేస్తామని ఆయన తెలిపారు.

కార్గిల్ సమీపంలో బాంబులు నిర్వీర్యం చేస్తూ ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ జవాన్ ఉమా మహేశ్వర రావుకు ఇంటికి కృష్ణదాస్ వెళ్లారు. ఆయన భార్య, పిల్లలను, కుటుంబ సభ్యులను పరామర్శించారు.  జవాన్ ఉమా మహేశ్వర రావుకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆమె కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు.

You might also like