FbTelugu

మంత్రి కొడుకు కోసం బదిలీ చేస్తారా?

మహబూబాబాద్: పదవీ విరమణకు 16 నెలల సమయం ఉన్న నన్ను అకారణంగా బదిలీ చేశారని మహబూబాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ భీం సాగర్ ఆందోళన వ్యక్తం చేశారు. తన బదిలీకి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడే కారణం అని ఆయన ఆరోపించారు.
తన కుమారుడి కోసమే మంత్రి నన్ను బదిలీ చేయించారని భీం సాగర్ అన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ నన్ను టార్గెట్ చేసి మానసికంగా వేధించారన్నారు. మంత్రి కుమారుడు ఛాతీ వైద్య నిపుణుడిగా పనిచేస్తున్నాడని, నెలలో వారం రోజుల మాత్రమే డ్యూటీ కి వస్తాడన్నారు. పని చేయకున్నా నెల రోజుల జీతం ఇవ్వాలని అధికారులపై వత్తిడి తెస్తాడన్నారు. అలా ఇవ్వకపోవడంతోనే నన్ను టార్గెట్ చేసి బదిలీ చేశారని డాక్టర్ భీం సాగర్ అన్నారు.

నేను అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాను. నాకు సూపరిండెంట్ పదవి వద్దు, డాక్టర్ గా పనిచేస్తానన్నా నాకు అవకాశం ఇవ్వలేదన్నారు. ప్రమోషన్ ఇచ్చినా సంతోష పడేవాడిని, ప్రమోషన్ ఇవ్వకుండా కేవలం డిప్యుటేషన్ పై హైదరాబాద్ పంపించారన్నారు. పని హైదరాబాద్ లో చేయాలి, జీతం మహబూబాబాద్ లో తీసుకోవాలా అని ఆయన ప్రశ్నించారు. ఏ తప్పు చేయకున్నా నన్ను అకారణంగా శిక్షించారు. సి.బి.ఐ , సి.బి.సి.ఐ.డి ఎంక్వైరీ కైనా నేను సిద్ధం అని భీం సాగర్ సవాల్ చేశారు.
మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి కలెక్టర్ల సహకారం తో ఎనలేని కృషి చేశా. మాజీ మంత్రి డీఎస్.రెడ్యానాయక్, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ నాకు సహాయ సహకారాలు అందించారు. అందరికీ నా కృతజ్ఞతలు అంటూ డాక్టర్ భీం సాగర్ కన్నీరుమున్నీరయ్యారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.