FbTelugu

వచ్చే ఏడాది గాంధీ లో అవయ మార్పిడులు: మంత్రి ఈటల

హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో అవయవమార్పిడి కోసం 5 అత్యాధునిక ఆపరేషన్ థియేటర్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ థియేటర్ల నిర్మాణం పూర్తయితే మరో 9 నెలల్లో అవయవ మార్పిడి చికిత్సలు అందుబాటులోకి రానున్నాయి.

నూతన ఆపరేషన్ థియేటర్ల నిర్మాణం పై ఇవాళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఏఎం.రిజ్వి, వైద్య విద్య సంచాలకులు డా. రమేష్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ  ఎండీ చంద్రశేఖర్ రెడ్డి తో పాటు గాంధీ ఆసుపత్రి వైద్య నిపుణులు పాల్గొన్నారు. రూ.35 కోట్లతో అత్యాధునిక థియేటర్లు నిర్మాణం చేసి, యంత్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. లివర్, కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు మరో 9 నెలల్లో గాంధీ లో అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి వివరించారు. 20 గంటల పాటు ఆపరేషన్లు జరుగుతాయి కాబట్టి డాక్టర్స్ , సిబ్బందికి అన్ని వసతులు ఉండేలా చూడాలని కోరారు. ఇన్ఫెక్షన్స్ రాకుండా అత్యాధునిక పద్దతుల్లో థియేటర్ల నిర్మాణం జరగాలని సూచించారు. దీర్ఘకాలికంగా మన్నికగా ఉండేలా చూడాలని మంత్రి ఈటల అధికారులను కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.